2 వ రోజు కొనసాగిన నిరవధిక సమ్మె*
* సమ్మెకు మద్దతు తెలిపిన విద్యార్థులు
* సమ్మెలో ఉగ్రదాడికి నిరసనగా ర్యాలీ
ప్రజా సింగిడి కామారెడ్డి, ఏప్రిల్ 23
తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో పార్ట్ టైం అధ్యాపకులు చేపట్టిన నిరోధిక సమ్మె రెండో రోజుకు చేరింది. నిరవధిక సమ్మెలో భాగంగా పార్ట్ టైం అధ్యాపకుల ఆధ్వర్యంలో మంగళవారం కాశ్మీర్ పహాల్గావ్ లో జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ విద్యార్థులతో క్యాంపస్ ఆవరణలో ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాలలో తమ సర్వీసులకు వెయిటేజీ ఇవ్వాలన్నారు. వెంటనే తమకు మినిమం టైమ్స్ స్కేల్ అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం తమ న్యాయమైన పోరాటాన్ని గుర్తించి తక్షణమే తమకు న్యాయం చేయాలని పార్ట్ అధ్యాపకులు కోరారు.
*ఎమ్మెల్యేకు వినతి పత్రం*

పార్ట్ టైం అధ్యాపకులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి కి వినతి పత్రం అందించారు. మీ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే అన్నారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర యూనివర్సిటీల జాయింట్ సెక్రెటరీ డా. ఇంద్రకరణ్ రెడ్డి, డా. కనకయ్య, డా. శ్రీను కేతవాత్, డా. రమేష్, డా.శ్రీకాంత్ గౌడ్, డా. పోతన, డా.వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.




Post Comment