10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేసిన భవన గారి శ్రీనివాస్
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి, 17.
మరికొద్ది రోజుల్లో మొదలు కాబోతున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమైన విద్యార్థిని విద్యార్థులకు దొంతి గ్రామంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా సామాగ్రి ని గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు భవన గారి శ్రీనివాస్ అందజేయడం జరిగింది. గత ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా ప్రోత్సాహం అందిస్తున్నటువంటి భవనగారి శ్రీనివాస్ కి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎచ్ ఎం చావ రవి, ఇంచార్జ్ ఎచ్ ఎం శ్రీనివాస్ , కృషి విజ్ఞాన్ గ్రామీణ అభివృద్ధి సంస్థ చైర్మన్ లక్ష్మీకాంతం , డాక్టర్ సుబ్రహ్మణ్యం , ఆనంద్, రాహుల్, బిక్షపతి, నాగరాజు, మల్లేష్, సత్యనారాయణ, స్వామి,రాజు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు




Post Comment