హర్ ఘర్ జల్ జిల్లాలో తాగునీటి సరఫరా అంశాలపై చర్చ…
హర్ ఘర్ జల్ జిల్లాలో తాగునీటి సరఫరా అంశాలపై చర్చ…
ప్రజా సింగిడి,కామారెడ్డి , జూన్ 10:
మంగళవారం జల్ జీవన్ మిషన్ న్యూఢిల్లీ అడిషనల్ సెక్రెటరీ మరియు మిషన్ డైరెక్టర్ జిల్లా కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి హర్ ఘర్ జల్ జిల్లాలో తాగునీటి సరఫరా అంశాలపై చర్చించారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలు మరియు ఇంటింటికి త్రాగునీట నీటి సరఫరా ఎలా జరుగుతుంది, నీటి నాణ్యతల ఎలా ఉంది ఎలా మానిటర్ చేస్తున్నారు. అనే అంశంపై చర్చించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ మాట్లాడుతూ జల్జీవన్ మిషన్ వెబ్ సైట్ లో ఉన్న జిల్లాలోని 953 ప్రభుత్వ పాఠశాలలతో పాటు జిల్లాలో గల 1095 అంగన్వాడి కేంద్రాలు, జిల్లాలోని 423 రెవిన్యూ గ్రామాలలో శుద్ధ త్రాగునీటిని సరఫరా వివరాలను జల్జీవన్ మిషన్ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డబ్ల్యూఎస్ ఈఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు.




Post Comment