స్వామి వివేకానంద 163 వ జయంతి సందర్భంగా ర్యాలీ*
*స్వామి వివేకానంద 163 వ జయంతి సందర్భంగా ర్యాలీ*
తూప్రాన్ ప్రజా సింగిడి మెదక్ జిల్లా స్టాపర్ జనవరి 10
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తూప్రాన్ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించి అనంతరం స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర కేలో భారత్ కో కన్వీనర్ బండారి ప్రశాంత్ మాట్లాడుతూ భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండులలో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి అతనికి ఉంది. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. భారతదేశాన్ని ప్రేమించి, భారతదేశం మళ్ళీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. ప్రతి ఒక్క విద్యార్థి మహనీయుని బాటలో నడవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చంద్రశేఖర్ లోకేష్ మణిదీప్ అభిషేక్ హర్షవర్ధన్ మనుతేజ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు




Post Comment