×

సేవ లో నూతన శకానికి శ్రీకారం చుట్టిన ఉత్తమ లయన్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి

లయన్స్ క్లబ్ లో ఇంటర్నేషనల్ పిన్ అవార్డ్ పొందిన లయన్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి

వంద సార్లు రక్తదానం చేసి ప్రాణం పోసిన మరో బ్రహ్మ

హైదరాబాద్ సెంట్రల్ న్యూస్ డెస్క్, ప్రజా సింగిడి,మెదక్ జిల్లా ప్రత్యేక ప్రతినిధి. మే10

కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు, మహా పురుషులౌతారు, తరతరాలకు తరగని వెలుగౌతారు అనేది అక్షర సత్యం. మనిషై పుట్టిన వాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ అనేది ఇక్కడ నిత్య సత్యం.సేవ లో నూతన శకానికి శ్రీకారం చుట్టిన ఉత్తమ లయన్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి లయన్స్ క్లబ్ లో ఇంటర్నేషనల్ పిన్ అవార్డ్ పొందిన లయన్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి రెడ్ క్రాస్ సొసైటీ లో సైతం వంద సార్లు రక్తదానం చేసి ప్రాణం పోసిన మరో బ్రహ్మ గా నిలిచి కొత్త శకానికి నాంది పలుకుతూ రెడ్ క్రాస్ అయిన లయన్స్ క్లబ్ అయినా ఏ రంగంలో నైన సక్సెస్ సాధించాలంటే పట్టుదలతో ముందుకెల్లి విజయాన్ని సొంతం చేసుకున్న మన మెదక్ జిల్లా ఆణిముత్యం లయన్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి సేవలను కొనియాడారు. మానవత్వం పరిమళించే మంచి మనిషి లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి గారికి తన సహచర లయన్స్ గర్వించేలా ఉత్తమ సేవలకు అపూర్వ గుర్తింపు లభించడం అపూర్వం, అద్భుతం, అనిర్వచనీయం అని ప్రధాన వక్తలు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి సేవలను అభినందించారు. లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి కి లయన్స్అంతర్జాతీయ అవార్డ్ ప్రధానోత్సవము ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ రామాయంపేట చార్టర్ సభ్యుడిగా 35 సంవత్సరాలుగా ఆర్తుల సేవయే పరమావధిగా ఆర్తులకు అన్ని రకాలుగా సేవలందిస్తూ గత రెండున్నర దశాబ్దాలుగా రక్త అవయవ దానాలకు కృషి చేస్తూ, అత్య వసర పరిస్థితులలో అవసరము ఉన్నవారికి సేవలందిస్తూ, రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ, రక్త అవయవ దానాల ప్రచారానికి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముఖ్యంగా యువతి యువకులకు అవగాహన కల్పిస్తూ, వృద్ధులకు ఆపదలో ఉన్నవారికి అన్ని రంగాలలో సేవలందిస్తున్న లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి కి లయన్స్ అంతర్జాతీయ అధ్యక్షులు లయన్ ఫిబ్రయిషీయో అలివేరా అభినందిస్తూ లయన్స్ అత్యంత ప్రతిష్టాకరమైన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ లీడర్షిప్ మెడల్ను లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ జి. బాబురావు కానిస్టిట్యూషనల్ ఏరియా లీడర్ ఆర్ సునీల్ కుమార్ అభినందిస్తూ హైదరాబాదు లో జరిగిన తెలంగాణ రాష్ట్రంలోని 8 లైన్స్ జిల్లాల నుండి పాల్గొన్న లయన్స్ ప్రతినిధులు పాల్గొన్న “మల్టీకాన్ కన్వెన్షన్” లో అవార్డును ప్రధానం చేశారు. కాగా రాజశేఖర్ రెడ్డి 54 మార్లు రక్తదానం చేసి ప్రాణాపాయకర స్థితిలో ఉన్నవారికి ప్రాణదానం చేస్తున్నారని, రక్తదాన శిబిరంలను నిర్వహిస్తూ, అవయవ దానం ల గురించి విస్తృత ప్రచారం నిర్వహిస్తూ, మారుమూల గ్రామాలలో సైతం అవయవ దానానికి ప్రజలను సంసిద్ధం చేస్తున్నారని అన్నారు.

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!