×

సెలవు దినాల్లో ఉపాధి కల్పన అధికారి పనిచేయడం ఎవరి లబ్దికోసం..?

◆సెలవు దినాల్లో పనిచేస్తూ తప్పిదాలను చక్కబెడుతున్న కామారెడ్డి ఉపాధి కల్పన అధికారి ?

◆ సెలవు దినాల్లో పనిచేయడం ఎవరి లబ్ధి కోసం ?

-◆అర్హతలున్నా   ఏజెన్సీలను అధికారులు గుర్తిస్తారా ?

◆ మ్యాన్ పవర్ ఏజెన్సీల నియామకం సాఫీగా సాగేనా ?

◆ సెలవు రోజు టెండర్ వేసిన ఏజెన్సీల నిర్వాహకులను జిల్లా కార్యాలయానికి పిలవడం వెనుక మతలభేమీటీ ?

ప్రజా సింగిడి,కామారెడ్డి

కామారెడ్డి జిల్లాలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్ పద్ధతుల్లో వివిధ రకాల ఉద్యోగుల నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం వివిధ మ్యాన్ పవర్ ఏజెన్సీల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో వివిధ మ్యాన్ పవర్ ఏజెన్సీల నిర్వాహకులు టెండర్ వేసుకునేందుకు మార్చి 25 వరకే గడువు ముగిసింది. అప్పటి వరకే చాలా జిల్లాల నుండి మ్యాన్ పవర్ ఏజెన్సీలు తమ దరఖాస్తులను జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో అందజేశారు. ఈ టెండర్
తుదిగడువు మార్చి 25 న వివిధ మ్యాన్ పవర్ ఏజెన్సీలు నుండి టెండర్ వేసేందుకు వచ్చిన అభ్యర్థుల టెండర్లను చెక్ లిస్ట్ ప్రకారం తీసుకోవాల్సి ఉంది. ఈ చెక్ లిస్టులో ఉపాధి కల్పన అధికారీతో పాటు ఈ చెక్ లిస్ట్ చూసేందుకు వేసిన వివిధ జిల్లా అధికారుల కమిటీ తనిఖీ చేయవలసింది. ఈ చెక్ లిస్టులో పిఎఫ్, జిఎస్టి, ఈఎస్ఐ, లేబర్ లైసెన్స్, ఈ ఎండి అమౌంట్ తదితర అంశాలతో కూడిన వివరాలను ఆ రోజే మ్యాన్ పవర్ ఏజెన్సీలు తమకు సంబంధించిన లిస్టులను పూర్తిగా అందించవలసి ఉంటుంది.

సెలవు దినాల్లో ఉపాధి కల్పన అధికారి పనిచేయడం ఎవరి లబ్దికోసం ?

సెలవు దినాల్లో ఉపాధి కల్పన అధికారి పనిచేయడం ఎవరి లబ్దికోసం ?

హనుమకొండ జిల్లాలో ఫుల్ టైం అధికారిగా పనిచేస్తున్న కామారెడ్డి జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య కామారెడ్డికి అప్పుడప్పుడు చుట్టం చూపుగా వస్తువు వెళ్లేవారు. ఈ మ్యాన్ పవర్ ఏజెన్సీల టెండర్లు ఎప్పుడైతే మొదలయ్యాయో అప్పటినుండి కామారెడ్డి కి ప్రభుత్వ కార్యాలయాలు పని దినాలలో, సెలవు రోజు అయిన అతనికి కావలసిన పనులను చక్కబెట్టకోవడానికి వస్తున్నట్లు సమాచారం. మంగళవారం రోజు సెలవు రోజు కావడం ఆ సెలవు రోజు అయిన ఈ మల్లయ్య కామారెడ్డి ప్రభుత్వ కార్యాలయంలో విధులు నిర్వహించడంతో అనుమానాలకు నిజమైన సాంకేతాలు వస్తున్నాయి. సెలవు రోజు అధికారులు ఉండరనే విషయాలు తెలిసిన ఈ మ్యాన్ పవర్ ఏజెన్సీల నిర్వాహకులు తమ స్టాంపులు, వివిధ రకాల పేపర్లతో జిల్లా కార్యాలయానికి రావడంతో అనుమానాలకు బలం చేకూరినట్లు అయింది. టెండర్ గడువు ముగిసిన అనంతరం ఏజెన్సీల కోసం టెండర్లు వేసిన నిర్వాహకులతో ఎలాంటి సత్సంబంధాలు, ఇలాంటి సమాచారాలను సంబంధిత అధికారులు కలిగి ఉండకూడదు.

టెండర్ల ప్రక్రియ సజావుగా సాగేనా ?

గతంలో మ్యాన్ పవర్ టెండర్ల కోసం ప్రభుత్వం ప్రకటన ఇస్తే ఈ కామారెడ్డి జిల్లా చుట్టుపక్కల జిల్లాల నుండి మాత్రమే ఈ మ్యాన్ పవర్ టెండర్లలో పాల్గొనేందుకు ఏజెన్సీల నిర్వాహకులు పోటీపడేవారు. కామారెడ్డి ఉపాధి కల్పనా అధికారి గా మల్లయ్య హనుమకొండ నుండి కామారెడ్డి కి రావడంతో హనుమకొండ చుట్టుపక్కల జిల్లాల నుండి సైతం ఏజెన్సీలను దక్కించుకునేందుకు అక్కడే నుండి టెండర్లు దాఖలవ్వడం పలు అనుమానాలకు తావిస్తోందని పలువురు టెండర్ వేసిన నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Please follow and like us:
Pin Share

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!