సీతారాముల కల్యాణానికి పుస్తె మెట్టెలు బహుకరించిన బండారి గంగాధర్
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. ఏప్రిల్, 6.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చండీ గ్రామంలో సీతారాముల కళ్యాణా మహోత్సవానికి పుస్తె మెట్టెలు బహుకరించిన బీసీ నాయకులు ప్రముఖ సంఘ సేవకులు బండారి గంగాధర్ ఈ సందర్బంగా బండారి గంగాధర్ కు గౌరవంగా శల్వతో సన్మానం చేయడం జరిగింది. ఆ భగవంతుని ఆశీస్సులు నీపైన మీ కుటుంబం పైన ఎల్లవేళలా ఉండాలని చెంది గ్రామ పెద్దలు భగవంతుడిని ప్రార్ధించారు. ఇలాంటి దైవ కార్యక్రమాలు చేయడం నాకు ఎంతో ఆనందనీయకరంగా ఉందని గంగాధర్ అన్నారు.అలాగే చిన్న గొట్టుముక్కల గ్రామ శివారిలో కొలువుదీరినటువంటి శ్రీశ్రీశ్రీ సహకార ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఆలయం దగ్గర సీతారాముల కళ్యాణా మహోత్సవాన్ని కన్నుల విందుగా వీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజిఆర్ యువ కిరీటం బండారి సాయికిరణ్ బి జి ఆర్ యువసేన అధ్యక్షులు కుమ్మరి నాగరాజు పెద్దపులి వినయ్ పిల్లి మణికంఠ పెద్దలు తదితరులు పాల్గొన్నారు




Post Comment