సీజనల్ వ్యాధులపై సిఎంఆర్ వైద్య విద్యార్థుల అవగాహన కార్యక్రమం
ప్రజా సింగిడి మెదక్ జిల్లా స్టాపర్ తూప్రాన్ఆగస్టు 23
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ 11వ వార్డు వడలపల్లిలో మాజీ వార్డు కౌన్సిలర్ బొంది అరుణ వెంకట్ ఆధ్వర్యంలో సీఎంఆర్ సంస్థ వారి వైద్య విద్యార్థులు ప్రస్తుత వర్షాకాల సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఇందులో భాగంగా సీఎంఆర్ మెడికల్ సిబ్బంది వచ్చి గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించడం జరిగింది.ఈ సందర్భంగా మరింత మెరుగైన చికిత్స కోసం అవసరమైతే సీఎంఆర్ ఆసుపత్రికి కండ్లకోయ రావాల్సిందిగా సిబ్బంది ప్రజలకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి మరియు మాజీ వార్డు కౌన్సిలర్లు టిఆర్ఎస్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Post Comment