సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేత
ప్రజా సింగిడి ప్రతినిధి మర్చి 28 జహీరాబాద్
జహీరాబాద్ పట్టణం లోని సెట్విన్ చైర్మన్ గెస్ట్ హౌస్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన జహీరాబాద్ మండల అధ్యక్షులు నరసింహారెడ్డి కాంగ్రెస్ నాయకులు ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి సీనియర్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారు.జహీరాబాద్ మండలం వివిధ గ్రామాలకు చెందిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు జహీరాబాద్ పట్టణంలోని ఆదర్శనగర్ గిరిధర్ రెడ్డి గెస్ట్ హౌస్ లో జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి.నర్సింహారెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చెయ్యడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.




Post Comment