×

సమయ పాలన పాటించని ఉపాధ్యాయులు -పట్టించుకోని మండల విద్యాధికారి

 

గ్రామస్తులు ఆవేదన

 

ప్రజా సింగిడి ప్రతినిధి మర్చి 27 జహీరాబాద్

 

జహీరాబాద్ నియోజకవర్గం లోని ఝరాసంగం మండలంలో కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల విద్యార్థులకు ఎండ తగులుద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం వంటిపూటబడులను నిర్వహిస్తున్న నేపథ్యంలో దీనిని ఆసరాగా చేసుకుని ప్రభుత్వ ఉపాధ్యాయులు 8 గంటలకు ప్రారంభం కావలసిన పాఠశాలలు 10 గంటలైనా తెచ్చుకోకపోవడంతో పాఠశాల విద్యార్థులు పాఠశాల పరిసరాలలో ఆడుకుంటూ సమయాన్ని గడుపుతున్నారు. ప్రభుత్వం కొన్ని లక్షల వెచ్చించి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని దేశంతో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న ఇలాంటి ప్రభుత్వ ఉపాధ్యాయుల ద్వారా ప్రజాధనం వృధా అవుతుంది. సిద్దాపూర్ గ్రామము ప్రభుత్వ పాఠశాల లో ఉపాధ్యాయాలు సమయం కి రారు గ్రామం ము లో విద్యార్థులు తల్లిదండ్రులతో అడిగితే మా గ్రామానికి సమయానికి టీచర్ రారు ఎన్నిసార్లు చెప్పినా ఇదే పరిస్థితి అని ఉపాధ్యాయులని అడుగుతే మేము పటాన్చెరువు నుంచి ఒకరము జహీరాబాద్ నుంచి ఒకరం వస్తామని అన్నారు గ్రామీణ ప్రాంతాలలోని బడుగు బలహీన వర్గాల పిల్లలకు మంచి విద్యను అందించాలని ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అది విఫలమవుతుంది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించు గాను ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ అది అందరి మిగులుతుంది. అధికారుల నిర్లక్ష్యం ప్రజా ప్రతినిధుల అరసత్వం వల్ల పాఠశాలలను తనిఖీ చేసేవారు లేకపోవడంతో పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఎవరికి వారే యమ్మా చర్య అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎందుకు సంబంధించి సంగారెడ్డి జిల్లా జరా సంఘం మండలం సిద్దాపూర్ ప్రభుత్వ పాఠశాల నిరసనగా చెప్పవచ్చు. సోమవారం ఉదయం 9 గంటల 20 నిమిషాలు అక్కడికి వెళ్లిన విలేకరులకు పాఠశాలకు తాళం వేసి ఉంది తాళం వేసి ఉంది. ఐదారు మంది పిల్లలు బయట ఆడుకుంటున్నారు. పాఠశాల విషయమై ఎందుకు తీయలేదని పిల్లలను ప్రశ్నించగా మా టీచర్లు రోజు 9 నుంచి 10 గంటల మధ్య పాఠశాలకు వస్తుంటారని 12 గంటలకి వెళ్లిపోతారని తెలిపారు. దీంతో విలేకరుల బృందం తిరిగి వస్తుండగా 9 గంటల 20 నిమిషాలకి పాఠశాల పని చేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు భూ లక్ష్మమ్మ, రోజా ఇద్దరు ఎదురుగా వచ్చారు. పాఠశాల సమయం గురించి అడగగా నేను పటాన్చెరు నుంచి వస్తానని భూ లక్ష్మమ్మ. జహీరాబాద్ నుంచి వస్తానని రోజా తెలిపారు. ఈ గ్రామానికి రవాణా సౌకర్యం లేదని తాము బస్సులో జరా సంఘం వరకు వచ్చి అక్కడి నుంచి ఆటోలు రావాల్సి వస్తుందని వారు తెలిపారు. ప్రభుత్వం సమయపాలన పాటించి గ్రామీణ ప్రాంతాల్లోని బీద బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన విద్యను తో పాటు మధ్యాహ్నం భోజనం లో పౌష్టికాహారాన్ని అందించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల అది నెరవేయడం లేదు. ఝ రాసంఘం మండల విద్యాధికారి మండలంలోని ఆయా పాఠశాలలను సందర్శించకపోవడం గైరాజరైన ఉపాధ్యాయులను పట్టించుకోకపోవడం మూలంగా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు నిర్లక్ష్యం మండల విద్యాధికారి శ్రీనివాస్ బర్దిపూర్ పాఠశాలలో హెచ్చరిక కుండా తన సొంత పనులపై జహీరాబాద్ మొక్కుబడిగా పనిచేయడం వల్లే పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు సమయపాలన పాటించలేదని విమర్శలు ఎంఈఓ తన సొంత బిజినెస్ చేయడం వల్ల పాఠశాల పై దృష్టి సాధించడం లేదని బహిరంగ విమర్శలున్నాయి. ఇక్కడి పాఠశాలలో ప్రభుత్వం ద్వారా వచ్చే యూనిఫామ్ లు కూడా ఇచ్చినప్పటికీ కొలతల కారణంగా తాము వేసుకోవడం గాని విద్యార్థులు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ ప్రజాధనం పాఠశాలపై ఖర్చు అవుతున్నప్పటికీ పిల్లలకు సరి అయిన విజ్ఞానాన్ని అందించలేకపోతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి సమయానికి పాఠశాలలు తెరిచి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు.

ఎం ఈ ఓ వివరణ

జరాసంగం మండలం సిద్ధాపూర్ గ్రామంలో ఉపాధ్యాయులు సమయానికి రావడం లేదని ఎంఈఓ ను వివరణ అడగాలని ప్రయత్నంలో ఆయనకు ఫోన్ చేసిన స్పందించరు. పైగా మీరు నా దృష్టిలో రిపోర్టర్లు కారు అనే ఉద్దేశంతో మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అనే అనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఇట్టి విషయంపై జిల్లా విద్యాధికారి వెంటనే స్పందించి ఉపాధ్యాయులపై మండల విద్యాధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా గ్రామస్తులు కోరుతున్నారు.

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!