షాద్ నగర్ నియోజవర్గం లో జనసేన పార్టీ బలోపేతానికి శాయశక్తుల పనిచేస్తా*
*షాద్ నగర్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాజు నాయక్*
*రాష్ట్రా నాయకులను కలిసిన రాజు నాయక్*
*షాద్ నగర్ ప్రజా సింగిడి ప్రతినిధి ఆగస్టు 23 రంగారెడ్డి జిల్లా*
షాద్ నగర్ లో జనసేన పార్టీ బలోపేతానికి శాయశక్తుల పనిచేస్తానని షాద్ నగర్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాజు నాయక్ అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు, టిటిడి బోర్డు మెంబర్ మహేందర్ రెడ్డి, జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జ్ వేమూరి శంకర్ గౌడ్, ప్రచార కార్యదర్శి RK సాగర్ హాజరయ్యారు. ఈ సమావేశానికి రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాజు నాయక్ హాజరై రాబోయే రోజులో షాద్ నగర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి తన శాయశక్తుల కృషి చేస్తానని రాష్ట్ర నాయకులకు రాజు నాయక్ హామీ ఇచ్చినట్టు తెలిపారు. అనంతరం పద్మ విభూషణ్ హీరో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Comment