శ్రీ శ్రీ రాము దాదా స్వామిని దర్శించిన గిరిజన సంక్షేమ సంఘం
శ్రీ శ్రీ రాము దాదా స్వామిని దర్శించిన గిరిజన సంక్షేమ సంఘం
నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు
మోహన్ పవర్
ప్రజా సింగిడి ప్రతినిధి నల్గొండ. ఫిబ్రవరి, 22.
హోలీ పండుగకు పది రోజుల ముందు ప్రారంభమయ్యే మూడు రోజుల మహా జాతర సందర్భంగా శేరిపల్లి గ్రామ దేవుడైన శ్రీ శ్రీ శ్రీ రాము దాదా స్వామిని గిరిజన సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు మోహన్ పవర్ భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి, ఇతర రాష్ట్రాలు మరియు విదేశాల నుండి సైతం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారి ఆశీర్వాదాలు పొందుతున్నారు. పాడి పంటలు పుష్కలంగా కలగాలని, సంతానం లేని దంపతులకు సంతానం కలగాలని, కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం నెలకొనాలని ఆకాంక్షిస్తూ భక్తులు దీపాదూప నైవేద్యాలతో ఆకాండ జ్యోతిని స్మరించుకుంటున్నారు.
ఈ సందర్భంగా మోహన్ పవర్ మాట్లాడుతూ, బంజారా సమాజ ఆరాధ్య దైవమైన శ్రీ రాము దాదా స్వామి మహిమ రోజు రోజుకూ విస్తరిస్తోందని, కొండమల్లేపల్లి నుండి 7 కిలోమీటర్ల దూరంలో కల్వపల్లి గ్రామ సమీపంలో ఉన్న ఈ దేవాలయం తెలంగాణ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందడం గర్వకారణమని తెలిపారు.
దేవాలయ పూజారి శ్రీ శ్రీ శ్రీ రామావత్ హరి నాయక్ గారు దేవాలయ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ భక్తులకు సదుపాయాలు కల్పిస్తున్నారని కొనియాడారు.
మూడు రోజుల పాటు కొనసాగే ఈ మహా జాతర విజయవంతం కావాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు నిండాలని గిరిజన సంక్షేమ సంఘం తరఫున మోహన్ పవర్ ఆకాంక్షించారు.




Post Comment