శివ్వంపేట మండలానికి 422 ఇందిరమ్మ ఇండ్లు మంజూరి
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. ఏప్రిల్, 26.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుపుతున్న మన ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నికల హామీలలో భాగంగా ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్లను దశలవారీగా మంజూరి చేస్తామని ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగానే నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో మన శివంపేట మండలానికి 382 ఇందిరమ్మ గృహాలను మంజూరు చేశారు. పైలెట్ ప్రాజెక్టు గ్రామమైన శభాష్ పల్లికి 40 ఇందిరమ్మ గృహాలను మంజూరు చేయడం జరిగింది. మొత్తం శివంపేట మండలానికి 422 ఇందిరమ్మ గృహాలను మంజూరు చేయడం జరిగింది. లబ్ధిదారుల ఎంపిక గ్రామాలలో ఉన్న ఇందిరమ్మ కమిటీల ద్వారా పారదర్శకంగా ఎంపిక చేయడం జరుగుతుంది. అసలైన అర్హులను గుర్తించి పార్టీలకతీతంగా ఎంపిక చేయడం జరుగుతుంది.గత పది సంవత్సరాల బి.ఆర్.ఎస్ పాలనలో గ్రామాలలో డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని ప్రకటించి ఒక గృహాన్ని కూడా మంజూరు చేయని ప్రభుత్వం అప్పటి కెసిఆర్ ప్రభుత్వం. అప్పుడు టిఆర్ఎస్ నాయకులు కడుపునింపుకోవడానికి వారి ఆస్తులు పెంచుకోవడానికి పనిచేసింది తప్ప ప్రజల కోసం ఏ ఒక్కరోజు కూడా పనిచేసిన దాఖలాలు లేవు.కానీ ప్రస్తుత మన తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు .శివంపేట మండలానికి 422 ఇందిరమ్మ గృహాలను మంజూరి చేయించిన నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాజి రెడ్డి కి , ఇన్చార్జి మినిస్టర్ కొండా సురేఖ కి , ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి శివంపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు మండల ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన శివ్వంపేట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా




Post Comment