శాంతియుతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి
–తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్
ప్రజాసేంగిడి స్టాపర్ మెదక్ జిల్లా. తూప్రాన్ ఆగస్టు 23
రాబోయే గణేశ్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని శివసాయి గార్డెన్ లో శుక్రవారం నాడు తూప్రాన్ గణేష్ ఉత్సవ కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డీఎస్పీ తో పాటు పాటు తూప్రాన్ సిఐ రంగ కృష్ణ,తూప్రాన్,మనోహరాబాద్,శివంపేట,వెల్దుర్తి ఎస్‌ఐలు,సంబంధిత మండలాల గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు,గణేశ్ విగ్రహ నిర్వాహకులు పాల్గొన్నారు.ఈ సమావేశాన్ని ఉద్దేశించి డీఎస్పీ మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా,సామరస్యపూర్వకంగా నిర్వహించుకోవాలని సూచించారు.ప్రజలలో ఎవరి మతభావాలను దెబ్బతీయకుండా అందరి సహకారంతో ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని తెలిపారు.అలాగే డీజేలను వాడరాదనీ,మండపాలలో సరైన విద్యుత్ కనెక్షన్లు,వైరింగ్ ఉండాలని ప్రతి మండపంలో కనీసం ఇద్దరు నిర్వాహకులు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు.భద్రతా చర్యల్లో పోలీసులు పూర్తిగా సహకరించబోతున్నారని కూడా స్పష్టం చేశారు.అదేవిధంగా సిఐ రంగ కృష్ణ గారు ఉత్సవాల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్రమశిక్షణ పాటించాలని నిర్వాహకులు,కమిటీ సభ్యులు,ప్రజలు పోలీసులతో కలసి సహకరిస్తే మరింత భద్రతగా,ఆనందంగా ఉత్సవాలు సాగుతాయని అన్నారు.సమావేశంలో పాల్గొన్న నిర్వాహకులు సభ్యులు పోలీసులు ఇచ్చిన సూచనలను పాటించేందుకు అంగీకారం తెలిపారు.
Post Comment