వైభవంగా శని అమావాస్య వేడుకలు,!
రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహా
వైభవంగా జేష్ఠాదేవి-శనైశ్వర కళ్యాణం
– ఆలయంలో ప్రముఖుల సందడి
ప్రజా సింగిడి ప్రతినిధి , అగస్ట్ 23 సంగారెడ్డి జిల్లా
ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లుతున్న బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో శని అమావాస్య వేడుకలు, శ్రావణమాసం ముగింపు ఉత్సవాలు వైభవంగా భక్తిశ్రద్ధలతో ముగిశాయి. శని అమావాస్య వేడుకలకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతి అవధూత గిరి మహారాజ్, సిద్దేశ్వరానందగిరి మహారాజ్ వైదిక మంత్రోచ్చారణల మధ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం శనైశ్వర స్వామిని దర్శించుకుని తైలాభిషేకం, శని మహా యజ్ఞంలో పాల్గొని పూర్ణాహుతి చేశారు. శని పూజ అనంతరం ఆలయంలో జ్యోతిర్లింగాలను దర్శించుకుని రుద్రాభిషేకం, మహా మంగళహారతి చేశారు. దత్తాత్రేయ స్వామి, పంచ వృక్షాలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. యజ్ఞం అనంతరం జ్యేష్టా దేవి సమేత శనైశ్వర స్వామి వారికి కళ్యాణం శాస్త్రోక్తం జరిగింది. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను జహీరాబాద్ కు చెందిన అల్లాడి జ్యోతిలక్ష్మి బక్కయ్య గుప్తా దంపతులు సమర్పించారు. కాగా ఉదయం 4:30 గంటలకు ఆలయ నిర్మాణ ధాత గాలి అనిల్ కుమార్ సుగంధ ద్రవ్యాలతో తైలాభిషేకం, మహా మంగళారతి నిర్వహించి భక్తులకు దర్శన అవకాశాన్ని కల్పించారు.ఆలయంలో ప్రముఖుల సందడి
శని అమావాస్య సందర్భంగా దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో వివిధ ప్రాంతాల భక్తులతో సందడి నెలకొంది. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు మఠం బిక్షపతి, నరోత్తం, జహీరాబాద్ డిఎస్పి సైదా, జహీరాబాద్, సంగారెడ్డి, నారాయణఖేడ్, రాయికోడ్, ఝరాసంగం, బీదర్ తదితర ప్రాంతాలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ తదితరులు పాలుగోన్నారు
Post Comment