వృద్దాప్య, వికలాంగుల పెన్షన్ లను వెంటనే పెంచాలి.
మాజీ చెర్మెన్ వై.నరోత్తం..
ప్రజా సింగిడి ప్రతినిధి అగస్ట్ 23 సంగారెడ్డి జిల్లా
ప్రతి వికలాంగ పెన్షన్ దారుడుకి రూ.60,000 లు
ప్రతి,వృద్దాప్య,వితంతు, ఒంటరి మహిళ,పెన్షన్ దారుడికి ప్రభుత్వం రూ.40,000 బకాయి పడింది* కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి నమ్మించి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు నడుస్తున్న ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ అమలు చేసింది లేదు, వృద్దాప్య పెన్షన్లు,వితంతు పెన్షన్లు,ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్లు రు.4000 కు పెంచుతామని అన్నారు ఇప్పటి వరకు అమలు చేసింది లేదు,వికలాంగుల పెన్షన్ రు. 6000 పెంచుతామని అన్నారు ఆ వికలాంగులకు కూడా అన్న మాట ప్రకారం ఇప్పటి వరకు పెంచింది లేదు ఇచ్చింది లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వృద్ధుల,వికలాంగుల ఉసురు తప్పక తగులుతుంది, వృద్ధుల,వికలాంగుల ఉసురు ఉరికెపోదు,గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ఇచ్చిందో అంతే పెన్షన్ ఇస్తున్నారే తప్ప వీరు కొత్తగా ఇస్తున్నది ఏమి లేదు,రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తెలంగాణా ప్రజలకు ఇంత దారుణంగా మోసం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ పని తనానికి నిదర్శనం,ప్రజలను ఎన్నికల్లో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలను తుంగలో తొక్కడం దుర్మార్గపు చర్య,అది కాంగ్రెస్ పార్టీ నైజాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న ప్రజలపై ప్రేమ ఉన్న ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి 20,నెలలుగా ప్రతి ఒక వికలాంగునికి రావాల్సిన బకాయి పెన్షన్ రూ. 60,000 లు, ప్రతి ఒక వృద్దాప్య,వితంతు,ఒంటరి మహిళలకు రూ.40,000 లు బకాయి డబ్బులను వెంటనే ఇవ్వాలని డిమాండ్, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అన్నిటిని అమలు చేసి స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడగాలి,ప్రజలందరు గమనించాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను ఏ ఒక్కటి అమలు చేయకపోయినా వచ్చే స్థానిక ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని అన్నారు,ఈ కార్యక్రమంలో నాయకులు జి.నర్సింలు,శికారి గోపాల్,లు తదితరులు పాల్గొన్నారు
Post Comment