విలేఖరి పై దాడి చేసిన 8 మంది అరెస్ట్*
*విలేఖరి పై దాడి చేసిన 8 మంది అరెస్ట్*
ప్రజా సింగిడి ప్రతినిధి అమీన్పూర్ నవంబర్ 9
అమీన్పూర్: శనివారం ఉదయం 3 గంటల ప్రాంతంలో కబ్జా భూమి వార్త కవర్ చేశాడన్న అక్కసుతో రిపోర్టర్ విఠల్ అనే విలేఖరి పై దాడి చేసిన 8 మందిని అరెస్ట్ చేసినట్టు అమీన్పూర్ సిఐ కె. నరేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గొడవలో పాల్గొన్న మధు అలియాస్ మధుసూదన్, వంశీ, నల్లమల శివ ప్రసాద్, యుగేందర్, కొత్త సంపత్, కుంచాల బ్రహ్మయ్య, సల్లడి హరీష్, కోడూరి స్వరాజ్ లను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సిఐ కె. నరేష్ పేర్కొన్నారు. ఈ ఘటనలో స్థానిక తహశీల్దార్ పై కూడ దాడి జరిగినట్టు తెలిసింది.




Post Comment