విద్యుత్ స్తంభం పడి ప్రమాదానికి గురైన వ్యక్తి మృతి –
ప్రజా సింగిడి మెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి మార్చి 31
మెదక్ జిల్లా కొల్చారం మండలం వెంకటపూర్ గ్రామం ఈనెల 21న శుక్రవారం సాయంత్రం ప్రకృతి వైపరీత్యంతో ఈదురు గాలుల బీభత్సం సృష్టించింది దీంతో విద్యుత్ స్తంభాలు పడి వైన్స్ ముందర నిలబడి ఉన్న వెంకటాపూర్ గ్రామానికి చెందిన నెల్లి రాములు తీవ్ర గాయాలపాలి రెండు కాళ్లు విరిగిపోవడం తో మెదక్ ఆసుపత్రిలో చేర్చారు అక్కడ చికిత్స పొంది మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చికిత్స పొందుతూ సోమవారం నాడు గాంధీ ఆసుపత్రిలో మృతి చెందాడు. నిరుపేద కుటుంబానికి చెందిన రాములు ప్రకృతి వైపరీత్యం తో మృతి చెందడం చాలా బాధాకరమని మృతుని కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు.




Post Comment