×

వనంలోంచి జనాల మధ్య కు వానరులు*

*వనంలోంచి జనాల మధ్య కు వానరులు* 

*గ్రామంలో కోతులు తాకడికి సతమతం అవుతున్న ప్రజలు* 

ప్రజా సింగిడి ప్రతినిధి ఫిబ్రవరి 10హత్నూర మండలం 

ఒకప్పుడు అడవుల్లో మాత్రమే కనిపించే వానరులు ఇప్పుడు గ్రామాల్లోకి ప్రవేశించి ప్రజల జీవితాలను అంతాలకుతలం చేస్తున్నాయి. ముసలి ముడుగు కాసాల దౌల్తాబాద్ రెడ్డి ఖానాపూర్ హత్నూర దేవులపల్లి తదితర గ్రామాలలో ఈ సమస్య తీవ్ర రూపం ధరించింది. కూరగాయలు పండ్ల మొక్కలతో పాటు మనుషులపైన దాడులు చేస్తున్న వానరులకు ప్రభుత్వం చర్యలు శూన్యంగా మారాయి. ఏళ్లుగా ఈ సమస్యలకు పరిష్కారం లేకపోవడంతో గ్రామస్తులు అసహనానికి గురవుతున్నారు. గ్రామాలలో ఉదయం లేచి మొదటి పని వానరులను తరిమి కొట్టడం మా ఇంట్లో పండ్ల మొక్కలు పెంచుకోలేం కూరగాయలు కూడా ఇక లేవు వీటికి భగవంతుడు ఎరుగు! అంటూ ముసలి మడుగు గ్రామస్తుడు అచ్చిని అంజయ్య సత్తయ్య గంగయ్య మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పెంచుకొని కోళ్లు రాత్రి వానరాల బందిగా మారుతున్నాయి. కాసాల గ్రామంలో పండ్ల వ్యవసాయం చేసే రైతులు ఇప్పుడు మొక్కలు పెట్టడం లేదని బాధతో చెప్పారు. ఈ సమస్య గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. పండ్ల కూరగాయలు పెంచి జీవనోపాధి చేసుకునే పేదలకు ఇది తీవ్ర నష్టం కాసాల రెడ్డి ఖానాపూర్ దౌల్తాబాద్ హత్నూర వడ్డేపల్లి దేవులపల్లి గ్రామాల్లో రోజు వానరులు ఇళ్ల లోకి చేరి ఆహారం దోచుకుంటున్నాయి పిల్లలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంచుతున్నాం అంటూ స్థానిక మహిళలు భయపడుతున్నారు. ఇటీవల కాసాల గ్రామంలో నలుగురికి తీవ్ర గాయాలు చేశాయి. ఇద్దరు ఐదేళ్ల చిన్నారి మీద వానరులు దాడి చేశాయి. చిన్న పెద్ద తేడా లేకుండా వాళ్లపై ఎగబడటం కొట్టడం.. మా చిన్న పిల్లలు భయంతో ఇంట్లోనే తాగుతున్నారు. అంటూ గ్రామస్తులు భయంతో చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు చిన్నారులపై నే దాడులు ఎక్కువగా ప్రాణాలు పోయేవరకు చూడకండి ఇప్పటికైనా చర్యలు తీసుకోండి అంటూ ఆయా గ్రామాల ప్రజల అధికారులకు విన్నపం చేస్తున్నారు. ఎన్నిసార్లు మొరపెట్టిన అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు ఈ సమస్యకు మూల కారణాలు అడవులు తగ్గిపోవడం అటవీ పర్యవేక్షణ లోపం మెదక్ జిల్లా నర్సాపూర్ అడవులు తగ్గుతున్నాయి. అక్రమ చెక్క కోత భూములు మార్పిడి కారణంగా వానరులు ఆహారం కోసం గ్రామాల వైపు మళ్లాయి అటవీ శాఖ పెట్రోలింగ్ లేదు. వానరాలను అదుపు చేస్తే ప్రణాళిక ఏమి లేదు అంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమస్యలు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. కానీ హత్నూర మండల ప్రాంతాల్లో తీవ్రత ఎక్కువ ప్రభుత్వాలు మారుతున్న పాలకులు మారుతున్నా ఇప్పటికైనా వివిధ గ్రామాల్లో సర్పంచులు చొరవ తీసుకొని వానరాలను పట్టి అడవుల్లోకి తీసుకువెళ్లాలి లేదా డ్రైవర్లు నియమించండి అని స్థానికులు తెలిపారు. అయినా ఇప్పటివరకు అధికారుల నుంచి స్పందన లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కోతుల నుంచి సమస్యలు తీర్చాలంటూ ప్రజలు కోరుకుంటున్నారు.

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!