లింగారెడ్డిపేట్లో చిరుత సంచారం
*లింగారెడ్డిపేట్లో చిరుత సంచారం*
*రెండు దూడలను హతమార్చిన చిరుత*
*అటవీశాఖ దర్యాప్తు*
మనోహరాబాద్, ప్రజాసింగిడి మెదక్ జిల్లా స్టాపర్, ఫిబ్రవరి, 28.
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట్ గ్రామ శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. రాష్ట్ర సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులు, గ్రామ సర్పంచ్ శివగోని పెంట గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం, గ్రామ పరిసర ప్రాంతాల్లో గత రాత్రి చిరుత సంచారం చేసి రైతుల పశువులపై దాడి చేసింది. ఈ ఘటనలో రైతులు ఆకుల సుధాకర్, బామని ఐలయ్యలకు చెందిన రెండు దూడలు మృతి చెందినట్లు సమాచారం. ఉదయం పశువుల మృతదేహాలను గమనించిన రైతులు వెంటనే గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న వెంటనే తెలంగాణ అటవీశాఖ కు సమాచారం అందించగా, మనోహరాబాద్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కె. చంద్రశేఖర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. దాడి ఆనవాళ్లను పరిశీలించి, అది చిరుత దాడి అయ్యే అవకాశ ముందని ప్రాథమికంగా అంచనా వేశారు.
గ్రామస్థులు భయాందోళనకు గురవుతుండగా, అటవీశాఖ అధికారులు రాత్రి సమయంలో అప్రమత్తంగా ఉండాలని, పశువులను బయటకు వదలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిరుత కదలికలపై నిఘా ఏర్పాటు చేసి, అవసరమైతే బోనులు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.




Post Comment