×

రైతు పేరుతో రాష్ర్టా సరిహద్దులు దాటుతున్న ధాన్యం ..!

రైతు పేరుతో రాష్ర్టా సరిహద్దులు దాటుతున్న ధాన్యం ..!

– అక్రమార్కులకు వంత పడుతున్న జిల్లా అధికారి..?

ఫామ్ 10 పై ధాన్యం అక్రమ రవాణా..?

– ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న రైసుమిల్లర్లు

లోడింగ్ రైస్ మిల్ నుండి..! ఫామ్ 10 వేరే గ్రామం నుండి..!!

ఫామ్ 10 ఎవరు ఇస్తారు..?
ఫామ్ 10పై ఎలాంటి ముద్రలు ఉండవా..?

రైస్ మిల్ ల్లో ధాన్యం లోడ్ అవుతే వారి బిల్స్, గాని “వే బిల్” గాని ఉండవా…?
ఫామ్ 10పై పంపించడానికి ఏమైనాఅధికారులు అనుమతులు ఇచ్చినారా…?

ప్రభుత్వం ధాన్యం ఇచ్చింది అమ్ముకోవడానికా…?
ధాన్యం మిల్లింగ్ చేసి ప్రభుత్వనికి బియ్యం పెట్టడానికా..?

ప్రజా సింగిడి,కామారెడ్డి:

కామారెడ్డి జిల్లాలోని కొందరు రైసుమిల్ వ్యాపారస్తులు ప్రభుత్వానికి భారీ మొత్తంలో గండి కొడుతున్నారు. ధాన్యం ను రైస్ మిల్లర్లు ఒకచోట నుండి మరోచోటకి తరలించేందుకు ఫామ్ 10ని వాడుతున్నారని ఆరోపణలు వున్నప్పుటి ఫామ్ 10ని అడ్డుపెట్టుకొని ఏకంగా రైతుల పేరు రాసి ఇతర రాష్ట్రాలకు ధాన్యాన్ని తరలిస్తున్నారు. . అక్రమ రవాణా అరికట్టవలసిన జిల్లా అధికారులే రిజిస్టర్లు రెండు రకాలు ఉంటాయని ఒకదాంట్లో కొనుగోలు మరో దాంట్లో అమ్మకాలు రాసుకోవచ్చు అని, రైస్ మిల్లర్ వ్యాపారస్తులు బయట ధాన్యాన్ని కొనుగోలు చేసి ఎక్కడైనా అమ్ముకుంటారని వాటికి ఎలాంటి లైసెన్సులు కానీ అనుమతులు కానీ ఉండవని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇటీవల ఒక రైతు పేరుపై 710 బస్తాల ధాన్యాన్ని ఇతర రాష్ట్రానికి తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ రైతు పంట పండించిన తర్వాత ఇన్ని రోజులు ధాన్యాన్ని తమ వద్ద ఉంచుకోరు. అలాంటిది ఒక రైతు పెరు పై 710 బస్తాల ధాన్యాన్ని ప్రస్తుతం అమ్మినట్లు ఫామ్ 10 లో రాశారు,సీజన్ వారిగా రైతులు పండించిన పంటను పూర్తిగా ప్రభుత్వ కొనుగోళ్లలోనే రైతులు తమ ధాన్యాలను విక్రయించుకున్నారు. కొత్తగా ఈ వడ్లు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు.. వ్యాపారి కనుక కొనుగోలు చేస్తే రైస్ మిల్ పేరు రాయాలి కానీ రైతు పేరు ఎలా రాస్తారు. అనే దానిపై జిల్లా అధికారికి వివరణ అడగగా ,సమాధానం చెప్పవలసిన జిల్లా అధికారి రిటర్న్ గా రాసివ్వండి తనిఖీ చేస్తానడం పలు అనుమానాలకు తావిస్తోంది. జిల్లా అధికారులు తమ విధాలను సక్రమంగా నిర్వహిస్తే ఇలాంటి అక్రమాలు జరిగాయని జిల్లా వ్యాప్తంగా పలువురు పేర్కొంటున్నారు.

Please follow and like us:
Pin Share

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!