రైతుల బాధలను పట్టించుకోని ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం
ప్రజా సింగిడి మెదక్ జిల్లా స్టాపర్ తూప్రాన్, ఏప్రిల్, 26.
నాలుగు రోజుల క్రితమే ప్రారంభమైన ఐకెపి వరి కొనుగోలు కేంద్రం ఇప్పటికీ రైతుల నుండి కొనుగోలు ప్రారంభించకపోవడంపై తూప్రాన్ మండల బిజెపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించినట్లు ప్రకటించినప్పటికీ, నిన్నటివరకు ఒక్క గింజ కూడా కొనుగోలు జరగలేదు. వర్షం కారణంగా వరి తడవడంతో రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారు.
ఈ పరిస్థితిని గమనించిన బీజేపీ నాయకులు ఐకెపి కేంద్రాన్ని సందర్శించి రైతులతో చర్చించారు. ప్రభుత్వం రైతుల కష్టాలను పూర్తిగా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తర్వాత రైతులు మరియు బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు భూమనగారి జానకిరామ్ గౌడ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు సి.హెచ్. మల్లేష్ యాదవ్, తూప్రాన్ కోఆర్డినేటర్ నత్తి మల్లేష్, తూప్రాన్ ప్రభారీ సాయిబాబా, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సంఖ్యా యాదగిరి, తాటి విఠల్, ఆర్.మహేష్ గౌడ్, జనరల్ సెక్రెటరీ పోతరాజు శరత్, సిద్దిరాములు, వి. నవీన్, మన్నె సాయి, మధుసూదన్, స్వర్గం రవి తదితర నాయకులు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. వెంటనే వరి కొనుగోలు ప్రారంభించకపోతే, రైతులు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. ప్రభుత్వం రైతుల బాధలను నిర్లక్ష్యం చేస్తే, మరింత తీవ్రమైన ఆందోళనలు తప్పవని బీజేపీ నాయకులు హెచ్చరించారు.




Post Comment