రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు – మూడు విభాగాలుగా జీవిత చరిత్ర
ప్రజా సింగిడి ప్రతినిధి జాహిరాబాద్, మర్చి, 17.
జహీరాబాద్ నియోజకవర్గం లోని ఝరాసంగం మండలంలోని కుప్పా నగర్ గ్రామ దేవతగా కొలువుదీరిన రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు. మంగళవారం అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చన, సాయంత్రం బోనాల ఊరేగింపు, రాత్రికి ఎల్లమ్మ జీవిత చరిత్ర నాటకాని ప్రదర్శిస్తున్నట్లు పేర్కొన్నారు. నాటకాన్ని మూడు విభాగాలుగా విభజించామని మొదటి భాగము మంగళవారం, రెండవ భాగము గురువారం, నిత్య పూజలతో పాటు ఎడ్ల బండ్ల ఊరేగింపు, ఎల్లమ్మ జీవిత చరిత్ర నాటకము ఉంటుందన్నారు. మూడవ భాగము శనివారము ప్రదర్శిస్తున్నట్లు వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.




Post Comment