రెడ్డిపల్లి గ్రామపంచాయతీ పాలక వర్గానికి ఘన సన్మానం.*
*రెడ్డిపల్లి గ్రామపంచాయతీ పాలక వర్గానికి ఘన సన్మానం.*
నర్సాపూర్ నియోజకవర్గ ప్రజా సింగిడి ప్రతినిధి జనవరి 9
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డి పల్లి గ్రామ పంచాయతీ పాలక వర్గానికి శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల బృందం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ హాజరై మాట్లాడారు.విద్యార్థిని విద్యార్థులు బాగా కష్టపడి చదివి పాఠశాలకు తమ తల్లితండ్రులకు మంచి పేరు తీసుకు రావాలని కోరారు.పాట శాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అన్నారు.అనంతరం సర్పంచి పద్మావతి అశోక్ గౌడ్ మాట్లాడుతూ పాట శాలలో ఎలాంటి అభివృద్ధి కావాలన్న అందుబాటులో ఉండి పాటశాల అభివృద్ధికి కృషి చేస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి పల్లి గ్రామ సర్పంచి పద్మావతి అశోక్,గ్రామ కార్యదర్శి రమేష్ గౌడ్,ఉపాధ్యాయులు రామ కృష్ణ,శ్రీనివాస్ గౌడ్,శేఖర్,అనురాధ, శ్వేత,రాధిక,వాణి,గ్రామ పాలకవర్గం పాల్గొన్నారు.




Post Comment