23,87,000 రూ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ప్రజా సింగిడి ప్రతినిధి నర్సాపూర్. మే ,13.
– అవసరమైన సమయంలో అండగా ఆవుల రాజిరెడ్డి ..
నర్సాపూర్ పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి , నర్సాపూర్ మరియు హత్నూర మండలాలకు చెందిన 51 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుండి మంజూరైన మొత్తం ₹23,87,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రభుత్వంతో పాటు ఆవుల రాజిరెడ్డి కి తమ కృతజ్ఞతలు తెలిపారు. అవసరంలో ఉన్నవారికి అండగా నిలబడేందుకు చేస్తున్న ఈ విధమైన సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో ప్రజాధారణ పొందుతున్నాయి.ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ, “ప్రజల సమస్యలు పరిష్కరించడమే నా ధ్యేయం. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సహాయం చేరేలా నిబద్ధతతో పనిచేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందించేందుకు ఇదే ఉదాహరణ” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.




Post Comment