రాష్ట్రస్థాయి అండర్ -18 అథ్లెటిక్స్ కు ఎంపికైన కార్తికేయ
ప్రజా సింగిడి కామారెడ్డి ఆగస్టు 23
రాష్ట్ర స్థాయికి ఎంపికైన బి టాపర్ విద్యార్థి
కామారెడ్డి జిల్లా ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగినటువంటి రాష్ట్రస్థాయి అండర్ -18 అథ్లెటిక్స్ విభాగంలో డిస్కస్ త్రో లో మొదటి స్థాయిలో నిలిచి బంగారు పతకం సాధించిన కామారెడ్డి జిల్లా వివేకానంద బి టాపర్ పాఠశాల విద్యార్థి బోనాల కార్తికేయ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికైయ్యారు, సంజీవ్,విధ్వంత్ గౌడ్, అఖిల్ భరణి మహతి లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లా స్థాయిలో రాణించారు. ఈ సందర్బంగా పాఠశాల డైరెక్టర్ రవి రెడ్డి
మాట్లాడుతూ ప్రతివిద్యార్ధికి విద్య తో పాటు క్రీడలు కూడా ముఖ్యమని తెలిపారు. ఈ సందర్బంగా విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి మరియు ప్రిన్సిపాల్ వీరభద్రప్ప , ఉపాధ్యాయులు చందుపట్ల శ్రీకాంత్, ముదాం శ్రీధర్ లు అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు మహిపాల్ ,నవీన్, దిలీప్, రాజీర్ లు పాల్గొన్నారు.
Post Comment