రామయపల్లి అండర్ బ్రిడ్జిని పరిశీలించిన తూప్రాన్ డి.ఎస్.పి
ప్రజా సింగిడి మెదక్ జిల్లా స్టాపర్, మనోహరాబాద్ ఆగస్టు 23
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద 44వ జాతీయ రహదారి మీదుగా ఉన్నటువంటి అండర్ బ్రిడ్జి లో ఉన్న వర్షపు నీరు నిలువ కావడంతో సమస్యలు తలెత్తిన నేపథ్యంలో తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ తూప్రాన్ సిఐ రంగ కృష్ణ మనోహరాబాద్ ఎస్సై సుభాష్ లతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు.అండర్ బ్రిడ్జిలో ఉన్నటువంటి నీటిని బయటకు పంపేందుకు ఏర్పాటుచేసిన మోటార్ల పనితీరును పరిశీలించారు తక్షణమే నీరు పైకి ఎత్తే విధంగా చర్యలు వేగవంతం చేయాలని డి.ఎస్.పి జిఎంఆర్ సిబ్బందికి సూచనలు ఇచ్చారు.ట్రాఫిక్కు కు ఎలాంటి అంతరాయం లేకుండా సాఫీగా కొనసాగుతుందని ప్రస్తుతం నీటిమట్టం గణనీయంగా తగ్గిపోయిందని వాహనాల రాకపోకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా తెలిపారు.
Post Comment