యువతిపై దాడి అత్యాచార యత్నం- ముగ్గురి పై కేసు నమోదు*
ప్రజ సింగిడి, ప్రతినిధి సూర్య పేట. మార్చి,20,
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో యువతిపై దాడి చేసి, శారీరకంగా కలవాలని బెదిరించి గాయపరిచిన సంఘటనలో ఇద్దరు యువకులతోపాటు, ఒక మహిళతో కలిపి ముగ్గురిపైన కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి ముత్తయ్య తెలిపారు.
*ఎస్సై జి ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం* హుజూర్ నగర్ లోని రోజా అనే మహిళకు, బాధిత యువతి స్నేహితురాలు. ఆమెకు రోజా వల్ల నూకతొట్టి ప్రమోద్ కుమార్ తో ఇటీవల పరిచయం ఏర్పడింది. అలా ప్రమోద్ కుమార్ తో యువతీకి సాన్నిహిత్యం ఏర్పడింది. ఇలా ఆమెతో స్నేహం పెంచుకొని ఈ నెల7న యువతిని మధ్యాహ్నం వేళ కలిసిన ప్రమోద్ కుమార్మాట్లాడుకుందామంటూ చెప్పి అమాయకపు మాటలతో నమ్మించి పట్టణం లోని ఎస్వి లాడ్జి కి తీ సుకువెళ్లి కబుర్లు చెబుతూ యువతికి మద్యం తాగించి మత్తులోకి జారుకోగానే ఆమెపై అఘాయిత్యం చేసాడు. ఆ..సమయంలో ఆమె నగ్నంగా ఉన్న ఫోటోలు సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించి తాను ఎప్పుడు రమ్మంటే అప్పుడు తన వద్దకు వచ్చి కలుస్తుండాలని లేకపోతే తనతో కలిసి ఉండగా తీసిన అశ్లీలఫోటోలు బయట పెట్టి పరువు తీస్తానని* బెదిరించాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత ఈనెల 18న యువతి స్నేహితురాలైన రోజా నూకతోట్టి ప్రమోద్ కుమార్ తో పాటు మరొక స్నేహితుడు లచ్చిమల్ల హరీష్తో కలసి బాధిత యువతిని సరదాగా అలా వెళ్లొద్దామంటూ కారులో ఎక్కించుకొని పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయ ప్రాంతంలో ఉన్న నిర్మానుష్యప్రదేశానికి తీసుకు వెళ్లినట్లు ఎస్ఐ తెలిపారు. అక్కడ రోజా బాధిత యువతిని నూకతొట్టి ప్రమోద్, లచ్చిమల్ల హరీష్ ల ఇద్దరితోనూ శారీరకంగా కలవాలని వత్తిడి చేసిందని, అందుకు బాదితురాలు నిరాకరించడంతో, ముగ్గురు కలిసి దాడి చేసి గాయపరిచారని బాధిత యువతి ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నిందితులైన రోజా నూకతొట్టి ప్రమోద్ కుమార్, లచ్చిమల్ల హరీష్ లపై కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.




Post Comment