యువకుడి అదృశ్యం కేసు నమోదు
ప్రజా సింగిడి ప్రతినిధి మార్చి 29: జహీరాబాద్
జహీరాబాద్ మునిసిపల్ పరిధిలో మహమ్మద్ అబ్దుల్ హమీద్ తండ్రి మోయినోద్దిన్ (34) వృత్తి మేస్త్రి అనే యువకుడు కనిపించడంలేదని అతని సోదరుడు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు జహీరాబాద్ పట్టణ ఎస్ఐ యం కాశీనాథ్ యాదవ్ పత్రిక ప్రకటనలో తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం జహీరాబాద్ పట్టణం రాంనగర్ నివాసి అబ్దుల్ హమీద్ ఈ నెల 27 రాత్రి 8 గంటల సమయంలో నమాజుకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుండి వెళ్ళి, ఇంటికి తిరిగి రాలేదు. అతని ఆచూకీ కొరకు ఎంత వెతికినా కనిపించక పోవడంతో, హమీద్ అన్న అగు మహమ్మద్ ఫరీద్ పోలీసులకు పిర్యాదు చేశారు




Post Comment