మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గా సలాక్ రాజేశ్వర శర్మ ఎన్నిక ఏకగ్రీవం
ప్రజాసింగిడి మెదక్ జిల్లా స్టాపర్,తూప్రాన్, మార్చి,18.
మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘం ఎన్నికలలో తూప్రాన్ కు చెందిన శ్రీ సలాక రాజు శర్మ మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సలాకరాజు శర్మ కుపలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సళాక రాజేశ్వర శర్మ రెండు సంవత్సరాలు అధ్యక్షునిగా కొనసాగుతారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సలాక రాజేశ్వర శర్మ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో బ్రాహ్మణ సంఘ భవనం నిర్మాణానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.తనను జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.




Post Comment