ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి తృతీయ వార్షికోత్సవం
ప్రజా సింగిడి ప్రతినిధి వెల్దుర్తి. మర్చి, 17.
వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో. శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలోతృతీయవార్షికోత్సవం. వైభవంగా జరుగుతున్నాయి.17/03/2025 సోమవారం నుండి 20/03/2025 గురువారం వరకు ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం రోజు ఉదయం గణపతి పూజ. నవగ్రహ. భావనము. బలి పూర్ణాహుతి. పెద్దమ్మ తల్లి కళ్యాణం సాయంత్రం అమ్మవారికి ఒడి బియ్యం పోయుట జరిగినది. పెద్దమ్మతల్లి పల్లకి సేవ కార్యక్రమం రాత్రి 7 గంటలకు నిర్వహిస్తారు. పచ్చని పందిళ్ళు విద్యుత్ లైట్లతో అంగరంగ వైభవంగా దేవాలయం అలంకరించారు. ప్రతాప నారాయణ శర్మ ఆలయ పూజారి. రాత్రి 9 గంటలకు ఒగ్గు బృందం వారిచే పెద్దమ్మ కథ చెప్పడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ముదిరాజ్ సంఘ పెద్దలు గ్రామ ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




Post Comment