మహబూబ్‌నగర్‌లో IIIT కొత్త క్యాంపస్…
మహబూబ్‌నగర్‌లో IIIT కొత్త క్యాంపస్
ప్రజా సింగిడి,29 మే:
బాసర రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ట్రిపుల్ ఐటీ కొత్త క్యాంపస్‌ను మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన నేపథ్యంలో జిల్లాకు చెందిన శాసనసభ్యులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, జనంపల్లి అనిరుధ్ రెడ్డి, చిట్టెం పర్ణికా రెడ్డి, తూడి మేఘా రెడ్డి, వీర్లపల్లి శంకర్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిశారు.




Post Comment