మహబూబాబాద్ సబ్ డివిజన్ లో రౌడీ షీట్ల తొలగింపు మేళా
28 మంది రౌడీ షీటర్లపై రౌడీషీట్ ఎత్తివేత
మార్పు కోసమే ఈ ప్రయత్నం
-మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతి రావు
ప్రజా సింగిడి ప్రతినిధి మహబూబాబాధ . మే,09 .
మహబూబాబాద్ డివిజన్ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన ప్రశాంతవంతమైన జీవితం గడుపుతున్న 28 మంది రౌడీ షీటర్లపై రౌడీషీట్ ను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఆదేశాలమేరకు తొలగించినట్లుగా మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతి రావు ప్రకటించారు.మహబూబాబాద్ డివిజన్ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన వున్నవారిపై రౌడీ షీట్ల తొలగింపుమేళా మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిర్వహించారు. ఇందులో ప్రశాంవంతమైన జీవితంతో పాటు ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలపాలలో పాల్గొనకుండా సాధారణ జీవితాన్ని గడుపుతున్న రౌడీ షీటర్లను గుర్తించి వారిపై రౌడీ షీట్ తొలగించేందుకుగాను జిల్లా పరిధిలో రౌడీషీట్ల తొలగింపు మేళాను ఏర్పాటు చేశారు .అధికారులు నెల రోజుల పాటు కసరత్తు చేసి రౌడీషీట్లను తొలగించడం జరిగింది.
దీని కోసం రౌడీషీటర్ల ప్రస్తుత జీవనవిధానంపై సంబంధిత స్టేషన్ అధికారులు క్షేత్ర స్థాయిలో సమీక్ష జరిపి రౌడీషీట్ తొలగింపు జాబితాను రూపొందించారు . ఈ జాబితాను అనుసరించి సత్ప్రవర్తన కలిగిన వారిపై జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ రౌడీషీట్ తొలగింపు మేళా నిర్వహించారు. ఈ మేళాను ఉద్దేశించి మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతి రావు మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా సాధారణ జీవితం గడుపుతున్న వారిపై రౌడీ షీట్లను ఎత్తివేస్తున్నట్టు తెలిపారు. .
ఎవరైనా నేరాలకు పాల్పడుతూ, ప్రజా జీవనానికి ఇబ్బంది కలిస్తూ , శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే రౌడీషీట్లు తెరుస్తామని , అలాంటి వారిపై పోలీసుల నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇక గత కొద్దికాలంగా రౌడీషీటర్లుగా గుర్తింపబడిన వ్యక్తులు సత్ప్రవర్తనతో జీవితాన్ని కొనసాగిస్తూ ఎలాంటి నేరాలకు పాల్పడకపోవడాన్ని గుర్తించడం జరిగిందని అందుకే ఇలాంటి 28మంది పై రౌడీషీట్ తొలగింపు చేశామని చెప్పారు. రౌడీషీట్ తొలగించబడిన వ్యక్తులు భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపాలని సూచించారు. అలాగే ఏదైనా ,ఎక్కడైనా నేరం జరిగితే పోలీసులకు సమాచారాన్ని అందించే భాధ్యాతయుతమైన పౌరులుగా వుంటూ పోలీసులకు సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వీరిని చూసి మిగితావారిలో కూడా మార్పు రావాలనే రౌడీషీట్లను తొలగించాం అని అన్నారు. హింసతో ఏది సాధించలేమని, ప్రతికారచర్యలతో కాకుండా పరస్పరం చర్చించుకోని సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో టౌన్ సీఐ దేవేందర్, డోర్నకల్ సీఐ రాజేష్, బయ్యారం సీఐ రవి, ఎస్ఐ తిరుపతి, రూరల్ ఎస్ఐ దీపిక తదితరులు పాల్గొన్నారు.




Post Comment