×

మల్లికార్జున జాతర మహోత్సవానికి ఆహ్వానం

ప్రజా సింగిడి ప్రతినిధి   గుమ్మడిదల. మార్చ్ 20

గుమ్మడిదల పురపాలక సంఘం పరిధిలోని శ్రీ మల్లికార్జున స్వామి వారి జాతర మహోత్సవ వేడుకలను ఈ నెల 23 (ఆదివారం) నుండి 26 (బుధవారం) వరకు యాదవ సంఘం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా ఆలయ నిర్వహకులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, మల్లికార్జున స్వామి కృపతో నియోజకవర్గ ప్రజలు ఆనందంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే, మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం రోజున తన ట్రస్టు ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు మల్లేష్ యాదవ్, కిష్టయ్య యాదవ్, నాయకులు ప్రమోద్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, చంద్ర రెడ్డి, సుధాకర్ రెడ్డి, సూర్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, జైపాల్ రెడ్డి, తుడుము రవి పాల్గొన్నారు.

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!