మన సంస్కృతి.. అద్భుత ప్రయాణం
చిన్నారులకు మన సంస్కృతి నేర్పించండి
–
మహామండలేశ్వర్ సిద్దేశ్వరానందగిరి
జహీరాబాద్ , ( ప్రజా సింగిడి ) న్యూస్ ఏప్రిల్ 12
జహీరాబాద్ నియోజకవర్గం లోని ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామము , తల్లిదండ్రులు తమ పిల్లలకు హిందూ సంస్కృతి, సాంప్రదాయాల గురించి నేర్పించాలి. రామాయణం, మహాభారతం, భాగవతం వంటి గొప్ప కథల నుండి నీతి కథలను దేవుళ్ళ కథలు, పండుగల గురించి చెప్పడం అలవాటు చేసుకోవాలని మహామండలేశ్వర బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ 1008 డాక్టర్ మహంత్ సిద్దేశ్వరానందగిరి భక్తులకు, తల్లిదండ్రులకు సూచించారు. ఝరాసంగం మండలంలోని బర్దిపూర్ గ్రామంలో శుక్రవారం జరిగిన కోట బాలమణి-రాజు దంపతుల కుమార్తె సాత్విక, కుమారుడు వంశీకృష్ణల పుట్టు పంచ వేడుకకు ఆయన హాజరై పిల్లలను దీవించారు. ప్రతి ఒక్కరూ మన సాంప్రదాయాలను, సంస్కృతిని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పిల్లలకు జరపవలసిన హిందూ సాంప్రదాయ పండుగలను నిర్వహించినందుకు కోట బాలమణి-రాజు దంపతులను ఆయన అభినందించారు. కొత్త బట్టలు వేయడం అంటే పిల్లలు సాంప్రదాయ దుస్తులు ధరించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపే పండుగ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేశం, మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి ఆయా గ్రామాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు హాజరయ్యారు.




Post Comment