×

భూ భారతి చట్టం రైతులకు రక్షణ కవచం

 

భూ భారతి చట్టం రైతులకు ఒక చుట్టం*

ప్రజా సింగిడి, వరంగల్ జిల్లా మే 6 , 

వర్దన్నపేట మండలం, ఉప్పరపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సును వర్దన్నపేట ఏఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య మండల పార్టీ అధ్యక్షులు ఎద్దు సత్యం మరియు జిల్లా నాయకులు పోచాల వెంకన్న గౌడ్ సందర్శించి రెవెన్యూ సదస్సు జరుగుతున్న తీరును పరిశీలించారు.ఈ సందర్బంగా ఏఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య మాట్లాడుతూ భూభారతి చట్టం అమలుపై వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఏంపిక చేయడం జరిగింది.వరంగల్ జిల్లాల్లో 12 మండలాలు ఉన్నప్పటికీ మన వర్ధన్నపేట ఎమ్మెల్యే కె. ఆర్.నాగరాజు గారి ప్రత్యేక చోరువతో వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట మండలం పైలెట్ ప్రాజెక్ట్ గా ఏంపికావడం జరిగిందనీ అని అన్నారు.ప్రజాకోణంలో తీసుకువచ్చిన భూభారతి చట్టంపై ప్రజల్లో విస్తృతస్థాయిలో అవగాహన కల్పించడంతోపాటు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక కాబడిన ఆయా మండలాల్లో భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిష్కరించడమే ఈ రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశమని ఏఎంసీ చైర్మన్ వెంకటయ్య అన్నారు. రెవెన్యూ సదస్సులలో రైతులు, ప్రజలు లేవనెత్తే సందేహాలకు వారికి అర్థమయ్యే భాషలో వివరించి రైతుల సమస్యలకు తగిన పరిష్కారం చూపాలని అధికారులను కోరారు. రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ఎంతో సమగ్రమైన అధ్యయనంతో తీసుకువచ్చిన భూభారతి చట్టాన్ని క్షేత్రస్థాయికి సమర్థవంతంగా తీసుకుపోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.తెలంగాణ సమాజంలో భూమి కీలకమైన అంశం,గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో కుటుంబాలు భూసంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నాయని ఏఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య ఆరోపించారు.ఒక కుట్రపూరతంగా, దురుద్దేశ్యముతో తీసుకువచ్చిన ధరణి వల్ల రైతులు ఇప్పటికీ అవస్థలు పడుతున్నారని అన్నారు. ధరణి ప్రజల జీవితాలు ఆగం చేసింది.ధరణి వల్ల ఎన్నో రైతు కుటుంబాలు చిన్నభిన్నాం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పెద్దలే ధరణి దంతాలకు అండగా నిలిచారని ఆరోపించారు.అందుకే సీఎం రేవంత్ రెడ్డి సలహాలు, సూచనలు మరియు ఆలోచనలకు అనుగుణంగా రైతు కళ్ళలో ఆనందం చూడాలనే సంకల్పంతో భూభారతి చట్టాన్ని తీసుకురవడం జరిగిందని తెలిపారు.

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!