×

భూ భారతి చట్టం రెవెన్యూ అవగాహన

భూ వివాదాల పరిష్కారానికి ‘భూ భారతి’ దోహదంచేస్తుంది కలెక్టర్ రాహుల్ రాజ్

 

తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మక కార్యక్రమం, భూభారతి చట్టం -2025, అవగాహన సదస్సు ,

 

ప్రజాసింగిడి మెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి ఏప్రిల్ 17

 

మెదక్ జిల్లా మనోరాబాద్ మండలం రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం, రెవిన్యూ అవగాహన సదస్సు లో ముఖ్య అతిధులు గా పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, తూప్రాన్ ఆర్టీవో జై చంద్ర రెడ్డి , తాసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి,ఎండిఓ కృష్ణమూర్తి, ఈ.ఈ పంచాయతీరాజ్

నరసింహులు, పిఎ.సిఎస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

భూ భారతి, రెవిన్యూ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల, ఉపముఖ్యమంత్రి వర్యులు, రెవిన్యూ శాఖ మాత్యులు సందేశాన్ని, వక్షువల్ ద్వారా రైతులు వీక్షించడం జరిగింది

ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన రైతులకు, భూ భారతి చట్టం – యొక్క విది విధానాలపై ‌ తూఫ్రాన్ ఆర్డీవో జై చంద్రారెడ్డి రైతులకు భూ లబ్ధిదారులకు సుదీర్ఘంగా వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ

భూ భారతి నూతన చట్టం భూ వివాదాల పరిష్కారానికి ‘భూ భారతి’ దోహదంచేస్తుందని

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి’ నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ జిల్లా మనోరాబాద్ మండలం ‌ రైతు వేదిక వద్ద భూభారతి నూతన చట్టంపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు.

ఈ సదస్సులలో కలెక్టర్ పాల్గొని, భూభారతి చట్టంపై, అందులోని అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ రైతులకు అవగాహన కల్పించారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ఆనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ఆర్.ఓ.ఆర్ చట్టాన్ని తెచ్చిందని వివరించారు. భూ సమస్యల పరిష్కారానికి ఎంతో వెసులుబాటు కల్పించే భూభారతి చట్టంపై అవగాహనను ఏర్పర్చుకోవాలని, దీనిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని రైతులకు హితవు పలికారు.

అనంతరం ‌ భూలబ్ధిదారుల సమస్యలపై సమాధానాల ద్వారా నివృత్తి చేశారు

ఈ సదస్సులలో డిప్యూటీ తాసిల్దార్ రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు, రైతులు, , తదితలు పాల్గొన్నారు,

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!