భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శం
జహీరాబాద్ ప్రజా సింగిడ్ ప్రతినిధి ఏప్రిల్ 08
జహీరాబాద్,ఏఐసీసీ పీసీసీ పిలుపు మేరకు మొగుడంపల్లి మండలంలోని విట్టు నాయక్ తండాలో జై బాబు, జై భీమ్, జై సంవిదాన్ రాజ్యాంగ రక్షణ పాదయాత్ర నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని జహీరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్ టిపిసిసి ఎగ్జిక్యూటివ్ మెంబర్ ధనలక్ష్మి మండల అధ్యక్షులు మొహమ్మద్ మాక్సూద్ ..* ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగమని అలాంటి రాజ్యాంగాన్ని రక్షించుకోవడం మన అందరి హక్కు బాధ్యత అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుండా రెడ్డి , మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాజీ సింగల్ విండో చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి , మాజీ కో ఆప్షన్ నెంబర్ హర్షద్ జమా పటేల్ గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




Post Comment