భక్తులతో కిటకిట లాడుతున్న చాకరిమెట్ల దేవస్థానం
లింగా కృత ఆకారంలో శ్రీ సహకార ఆంజనేయ స్వామి దర్శనం
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట .నవంబర్ 17;
కార్తిక మాసం చివరి సోమవారం కావడంతో తెలంగాణ ప్రాంతంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలోని చిన్న గొట్టిముక్కుల గ్రామపంచాయతీ పరిధిలోగల దట్టమైన అడవి ప్రాంతంలో వెలసిన చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవస్థానం ఈ సంవత్సరం కార్తీక మాసంలో ప్రతిరోజు భక్తులతో కిటకిటలాడుతూ కనిపించింది,ఉమ్మడి మెదక్ జిల్లా ప్రాంతంలోని భక్తులే కాకుండా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నుండి కూడా వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించు కుంటున్నారు,ఈ కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో శ్రీ సహకార ఆంజనేయ స్వామి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులకు లింగా కృత ఆకారంలో దర్శనం ఇవ్వడం జరిగింది,వేలాదిమంది దంపతులు ఈ కార్తిక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాల మండపంలో దేవస్థానం ఫౌండర్ చైర్మన్ భాస్కరాయిని ఆంజనేయ శర్మ,ప్రధాన అర్చకులు దేవదత్తు శర్మ ఆధ్వర్యంలో వ్రతాలు నిర్వహించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు,ఈ సంవత్సరం అంచనాలకు మించి భక్తులు రావడంతో దేవస్థానం పాలకమండలి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలవకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది,వేలాది మంది గా వస్తున్న భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం పాలకమండలి ఆధ్వర్యంలో దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన వితరణ ఏర్పాటు చేయడం జరుగుతుంది,ప్రతిరోజు భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ఫౌండర్ చైర్మన్ ఆంజనేయ శర్మ,కార్య నిర్వహణ అధికారి సారా శ్రీనివాస్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు,పెద్ద ఎత్తున వస్తున్న భక్తులు అభిషేకాలు అర్చనలు చందనం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు,ఈ సందర్భంగా దేవస్థానం ఫౌండర్ చైర్మన్ ఆంజనేయ శర్మ,ఈవో సారా శ్రీనివాస్ మాట్లాడుతూ చాకరి మెట్ల,దేవస్థానం అభివృద్ధితోపాటు,అన్నదాన వితరణకు దాతలు ముందుకు రావాలని వారు విజ్ఞప్తి చేశారు,ఈ విషయంలో దేవస్థానం ఫౌండర్ చైర్మన్ ఆంజనేయ శర్మ ప్రత్యేకంగా చొరవ తీసుకొని దేవస్థానం అభివృద్ధి తో పాటు,భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్నదాన వితరణ కోసం ప్రతిరోజు దాతలకు విజ్ఞప్తి చేస్తున్నారు,ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు దేవదత్తు శర్మ,అర్చకులు దేవి శ్రీ శర్మ,శ్రీ వాత్సవ శర్మ,శ్రీ హర్ష శర్మ,జూనియర్ అసిస్టెంట్ రామకృష్ణ,సిబ్బంది తదితరులు ఉంటున్నారు,




Post Comment