బ్యాడ్మింటన్ పోటీలు. ప్రారంభించిన… మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పుల్లెల గోపీచంద్*
*తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ పోటీలు. ప్రారంభించిన… మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పుల్లెల గోపీచంద్*
*షాద్ నగర్ ప్రజా సింగిడి ప్రతినిధి సెప్టెంబర్ 02 రంగారెడ్డి జిల్లా*
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలం చేగూర్ కన్హా శాంతివనం లో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 79 వ సౌత్ జోన్ అంతరాష్ట్ర బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించారు. ఈ పోటీలు ఐదు రోజుల పాటు పుల్లెల గోపీచంద్ అకాడమీ లో జరగనున్నాయి. ఈ పోటీల్లో తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ కర్ణాటక, కేరళ, తమిళనాడు ఐదు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పోటీ పడుతున్నారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ సౌజన్ బ్యాడ్మింటన్ పోటీలు తెలంగాణలో నిర్వహించడం సంతోషకరమన్నారు. రాబోయే ఒలంపిక్ క్రీడల్లో బ్యాట్మెంటన్ తరఫున స్వర్ణ పథకాన్ని సాధించే దిశగా గోపీచంద్ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల కోసం వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్పోర్ట్స్ పాలసీని ఏర్పాటు చేసి తగినన్ని నిధులు కేటాయిస్తున్నామన్నారు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్నారు.
కాలేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం జ్యుడీషియల్ ఎంక్వైరీ వేశామని, అవకతవకలపై మరింత లోతుగా అధ్యయనం చేసేటందుకు కేసును సిబిఐకి అప్పగించామన్నారు. సిబిఐ విచారణలో దోషులు ఎవరైనా తప్పించుకోలేకపోతున్నారు. గత ప్రభుత్వంలో అక్రమాలు చేసిన వారందరికీ కచ్చితంగా న్యాపరమైన చర్యలుంటాయన్నారు.
Post Comment