బ్యాట్ తొ బాది భార్యను హత్య చేసిన భర్త..
బ్యాట్ తొ బాది భార్యను హత్య చేసిన భర్త..
ప్రజా సింగిడి ప్రతినిధి అమీన్పూర్ నవంబర్ 9
అమీన్పూర్: భార్య పై అనుమానంతో భర్త భార్యను హత్య చేసిన సంఘటన అమీన్పూర్ పట్టణంలో ఆదివారం చేసుకుంది. పట్టణంలోని కేఎస్ఆర్ కాలనీ లో నివాసముండే భార్యాభర్తలు కృష్ణవేణి బ్రహ్మయ్య గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. భార్య కృష్ణవేణి కోహిర్ డీసీసీబీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తుంది. గత కొంతకాలంగా బ్రహ్మయ్య భార్య కృష్ణవేణి పై అనుమానం పెంచుకున్నాడు. ఆదివారం ఉదయం ఈ విషయమే ఇద్దరి మధ్య గొడవ జరగడంతో బ్యాట్ తో కృష్ణవేణి పై దాడి చేసి హత్య చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు అమీన్పూర్ సిఐ కె.నరేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.




Post Comment