బ్యాక్ లాగ్ సీట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
ప్రజా సింగిడి మెదక్ జిల్లా స్టాపర్, వెల్దుర్తి, మార్చి, 17.
జిల్లాలోని ఎంజేపీ మహాత్మ జ్యోతిబాపూలే, బీసీ గురుకుల పాఠశాలల్లో 6, 7, 8, 9వ తరగతిలో బ్యాక్ లాగ్ సీట్ల భర్తీ కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని వెల్దుర్తి ఎంజేపీ ప్రిన్సిపాల్ ఏ.అర్.కే వందన తెలిపారు. సోమవారం వెల్దుర్తి ఎం.జె .పి. ప్రిన్సిపాల్ ఏ.అర్.కే వందన మాట్లాడుతూ జిల్లాలోని బాలురు, బాలికల ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలో 2025-26 సంవత్సరంలో మిగిలిపోయిన ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన విద్యా ర్థులు ఈనెల 31వ తేదీలోపు అన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 20వ తేదీన ప్రవేక్ష పరీక్ష ఉంటుందని, మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్విని యోగం చేసుకోవాలని సూచించారు.




Post Comment