బీసీలకు తీవ్ర అన్యాయం…
బీసీలకు తీవ్ర అన్యాయం…
బీసీల బడ్జెట్ 40వేల కోట్లకు పెంచాలి
◆నీల నాగరాజు
బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు
ప్రజా సింగిడి,కామారెడ్డి
రాష్ట్ర వార్షిక బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది.56 శాతం ఉన్న బీసీలకు కేవలం 3.74 శాతం రూ.11,405 కోట్లు మాత్రమే కేటాయించడం దారుణం.కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం ప్రతీ సంవత్సరం బీసీలకు 20 వేల కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తామని చెప్పి,ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు.ఇప్పటికే బీసీ విద్యార్థుల ఫీజు బకాయిలు 6000 కోట్లు పెండింగులో ఉన్నాయి,బీసీ గురుకులాలకు,సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు లేవు,వసతులు అసౌకర్యం గా ఉన్నాయి.
ఉమ్మడి నిజామబాద్ లోని తెలంగాణ యూనివర్సిటీ కి 100 కోట్లు కేటాయించాల్సింది పోయి కేవలం 35 కోట్లు మాత్రమే కేటాయించి యూనివర్సిటీ అభివృద్ధిని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీసీ లకు బడ్జెట్ ను 40 వేల కోట్లకు పెంచాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.




Post Comment