బీట్ ఆఫీసర్‌పై లంచం ఆరోపణలు
బీట్ ఆఫీసర్‌పై లంచం ఆరోపణలు
రైతులతో కాళ్లు మొక్కించుకున్న ఘటన కలకలం
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఓ గ్రామంలో ఘటన
అటవీ బీట్ ఆఫీసర్ రైతులను బెదిరించినట్టు ఆరోపణలు
కేసు భయంతో కాళ్లు మొక్కించుకుని లంచం వసూలు చేసినట్టు వాదన
ఫోన్‌పే ద్వారా ₹5,000, నగదు రూపంలో ₹10,000 తీసుకున్నట్టు సమాచారం
ప్రజా సింగిడి ప్రతినిధి కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం. ఫిబ్రవరి, 28.
చర్యలు తీసుకోవాలని రైతులు, పాడి పరిశ్రమ వర్గాల డిమాండ్
వివరాలు:
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఓ గ్రామానికి సంబంధించిన అటవీ బీట్‌లో పనిచేస్తున్న బీట్ ఆఫీసర్‌పై రైతులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గ్రామానికి చెందిన కొందరు రైతులు పశువులను అడవిలోకి వెళ్లనిచ్చిన కారణంగా తమపై కేసులు పెడతానని బెదిరించి, ఆ అధికారి లంచం వసూలు చేసినట్టు వారు వాపోతున్నారు.బాధిత రైతుల కథనం ప్రకారం, కేసు నమోదు చేస్తానని భయపెట్టి కాళ్లు మొక్కించుకునే స్థాయికి పరిస్థితి తీసుకెళ్లారని, ఒకసారి ఫోన్‌పే ద్వారా ₹5,000, మరోసారి నగదు రూపంలో ₹10,000 తీసుకున్నట్టు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది.ఇలాంటి ప్రవర్తన వల్ల పాడి పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని, పశుపోషణపై ఆధారపడి జీవిస్తున్న రైతుల జీవనాధారం దెబ్బతింటోందని పశు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల బెదిరింపుల కారణంగా పశువులను మేపే హక్కు కూడా కోల్పోతున్నామని రైతులు వాపోతున్నారు.ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ చేపట్టి, నిజానిజాలు తేల్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పాడి పరిశ్రమ మరింతగా క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.




Post Comment