బాల్య వివహాల పై అవగాహన
నర్సాపూర్ సిడిపిఓ హేమా భార్గవి
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి, 24.
బాల్యవివాహాలతో అనర్థాలు జరుగుతాయని పెళ్లీడు వచ్చిన తర్వాత పెళ్లిళ్లు చేయాలని నర్సాపూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ హేమ భార్గవి తెలిపారు. శివంపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలోని జాతర లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా, మహిళా శిశు ఆరోగ్యం తదితర అంశాలపై ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హేమ భార్గవి మాట్లాడుతూ పెళ్లివయస్సు వచ్చేవరకు పిల్లలకు పెళ్లిళ్లు చేయొద్దు అన్నారు. ఆరోగ్యం పట్ల మహిళలు పిల్లలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. 181. 1098. హెల్ప్ లైన్ గురించి తెలియపరిచారు.పోకసో చట్టం పైన అవగాహన కల్పించారు. మరియు అంగన్వాడి కేంద్రాల్లో పంపిణీ చేసే పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పిల్లల అక్రమ రవాణా చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. సమస్యలు ఉంటే హెల్ప్ లైన్, పోలీసులకు ఫోన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్ సంతోష, జెండర్ స్పెషలిస్ట్ కవిత నాగమణి మల్టీ టాకింగ్ స్టాప్, లక్ష్మణ్ రమేష్ అంగన్వాడీ టీచర్లు రేణుక పద్మ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




Post Comment