బర్దిపూర్ ఆశ్రమ వేదక ఉపాధ్యాయులు, మృతి
జహీరాబాద్, ప్రజా సింగిడి న్యూస్, మే 29,సంగారెడ్డి జిల్లా
జహీరాబాద్ నియోజకవర్గం లోని గ్రామము, కుప్పా నగర్ నివాసి, శివ శంకర్ స్వామి బర్దిపూర్ గ్రామం శ్రీ శ్రీ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ వేదిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివ శంకర స్వామి బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడి ఆసుపత్రిలో మృతి చెందినట్టు కుటుంబీకులు తెలిపారు. అయన 500 మంది విద్యార్థులకు వేదిక శిక్షణ, వేదిక విద్యను బోధించాడు. బర్దిపూర్ ఆశ్రమం మొత్తం శోకసముద్రంతో మునిగిపోయింది. వివిధ ఆలయాల్లో అర్చకులుగా స్థిరపడిన తన శిష్యులు తమ గురువు ఇక లేరని తెలియడంతో ఆశ్రమానికి చేరుకొని, చివరిసారి తన గురువును చూసి నిర్జీవ దేహాన్ని చూసి విలపిస్తూ దుఃఖించారు. తన జీవితాని సమాజసేవకు, వేదిక విద్యను బోధిస్తూ వేదిక పాఠశాలకు అంకితం చేశారని కొనియాడారు. ఆయన మృతి బర్టిపూర్ ఆశ్రమానికి, వేదిక పాఠశాల విద్యార్థులకు తీరని లోటు అని తన శిష్యులు పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల శ్రీశ్రీశ్రీ 1008 వైరాగ్య శికామణి అవధూత గిరి మహారాజ్, డాక్టర్ మహంత్ సిద్దేశ్వర నందగిరి, మల్లన్న గట్టు స్వామీజీ, బసవలింగం వీరేశ్వర శివాచార్య. వివిధ ఆశ్రమాల పిఠాధిపతులు, గురువులు, ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు




Post Comment