ప్రశాంతంగా ముగిసిన నీట్ (యుజి)-2025 పరీక్షా
పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
ప్రజా సింగిడి ప్రతినిధి సంగారెడ్డి. మే, 04.
సంగారెడ్డి జిల్లాలో జరిగిన నీట్ (యుజి) పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలియజేశారు. జిల్లాలోని అన్నీ నీట్ (యుజి)-2025 పరీక్షా కేంద్రాలను సందర్శించి, బందోబస్తు ఏర్పాట్లను పర్యాయవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. నీట్ పరీక్ష రాయడానికి వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉదయం నుండే ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందిని, అదే విధంగా పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి సెంటర్ వద్ద ఎస్ఐ ర్యాంక్ అధికారి, సిబ్బందితో కట్టుదిట్టమైన పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలియజేశారు. ఇన్స్పెక్టర్స్, డియస్పీ స్థాయి అధికారులు నోడల్ అధికారి అదనపు.ఎస్పీ ఎ.సంజీవ రావ్ ఆద్వర్యంతో పరీక్షా ముగిసి, పరీక్ష పత్రాలు స్ట్రాంగ్ రూమ్ చేరే వరకు పెట్రోలింగ్ నిర్వహిస్తూ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తును నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ అన్నారు.




Post Comment