ప్రమాదానికి నిలయంగా తూప్రాన్ చౌరస్తా
ప్రజా సింగిడి మెదక్ జిల్లా స్టాపర్,తూప్రాన్ ఆగస్టు 23
తూప్రాన్ మున్సిపల్ లోని నర్సాపూర్ చౌరస్తా ప్రమాదానికి నిలయంగా మారింది. మున్సిపల్ ఏర్పడిన కొత్తలో రోడ్డు మధ్యలో రంగురంగుల కాంతి ద్విపాలతో అనిమల్ వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేసారు. నిరంతరం గజ్వేల్,పోతురాజుపల్లి,మీదుగా భారీ వాహనాలు చౌరస్తా నుండి నర్సాపూర్ కు వెళ్లడం జరుగుతుంది. భారీ వాహనాలు చౌరస్తా నుండి వెళ్ళడానికి రోడ్డు వెడల్పు లేకపోవడంతో వాహనాలకు మాలుపడానికి ఇబ్బందిగా మరి ఇతర వాహనాలకు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. చౌరస్తాలో ట్రాఫిక్ నియమాలు లేక వాహనాలు వేగంగా రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ఇరుప్రక్కల చిరువ్యాపారాల బండిలు నిల్వడంతో రోడ్డుపై వాహనాలకు సౌకర్యం లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మున్సిపల్ అధికారులు, ప్రభుత్వ అధికారులు ద్రుష్టి సాధింది, చౌరస్తా లోని రోడ్డు ను ప్రయాణ సౌకర్యం, ట్రాఫిక్ నియమాలను ఏర్పాటు చేసి ప్రయాణికులు కష్టలను తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.
Post Comment