ప్రధాన రోడ్లపై వ్యాపారస్తులు ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దు,,
జాగో తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు నేత,, పి, రాములు
ప్రజా సింగిడి ప్రతినిధి అగస్ట్ 24 సంగారెడ్డి జిల్లా
జహీరాబాద్ పట్టణంలోని మీడియా సమావేశంలో ప్రధాన రోడ్లపై వ్యాపారాలు నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యాపారులపై చట్టరీత్యా తగు చర్య
సవినయంగా తెలుపుతూ కోరినది పి. రాములు నేత జాగో తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు అను నేను లిఖితపూర్వకంగా తమరి దృష్టికి జహీరాబాద్ పట్టణ ప్రజల ప్రజా ప్రయోజనం కోసం కొన్ని విషయాలు తీసుకు వస్తున్నాను నిన్నటి రోజు తమ కార్యాలయం ఆధ్వర్యంలో కొంతమంది నిలకడగలేని వీధి వ్యాపారాలు అనగా తోపుడుబండ్లపై గంపలలో సైకిల్ పై జహీరాబాద్ పట్టణ వీధులలో తిరుగుతూ వ్యాపారాలు నిర్వహించుకుంటున్న నిరుపేదలను దయచేసి కొంచెం మన్నించి వాళ్ల పేదరికానికి ఆలోచించి కొంచెం ఉపేక్షించగలరని సవినయంగా కోరుతూ అదేవిధంగా జహీరాబాద్ పట్టణంలోని మాణిక్ ప్రభు స్ట్రీట్ నుండి రైల్వే స్టేషన్ వరకు హెూటల్ సిద్ధి నుండి ఆదర్ నగర్ మెయిన్ గేట్ వరకు పరంపర స్వీట్ హౌస్ నుండి బైపాస్ ఎక్స్ రోడ్ వరకు ఉగ్గేల్లి ఎక్స్ రోడ్ నుండి బీదర్ ఎక్స్ రోడ్ వరకు అనేకమంది వ్యాపారస్తులు వారి నిర్ణీత స్థలాన్ని వదిలి పెట్టి ప్రభుత్వ రోడ్లపై దాదాపు 40 ఫీట్లు ముందుకు వచ్చేసి వ్యాపారాలు నిర్వహిస్తూ జహీరాబాద్ పట్టణంలోని సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో ఈ రకంగా నిర్వహించే వ్యాపార సంస్థల ముందు ప్రజలు తమ ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు కాబట్టి జరిగిపోయిన విషయాలను వదిలి పెట్టి ఇకనైనా ఈ వ్యాపారుల మూలంగా ఎవరికి ఎలాంటి హాని జరగకుండా వీరు నిర్వహిస్తున్న కేంద్రాల వద్ద పరిస్థితిని పూర్తిగా చూసి తగు చర్యలు తీసుకుంటారని సవినయంగా కోరుతున్నాము మా దరఖాస్తుతో కొన్ని ఫోటోలను కూడా జత చేయుచున్నాము.
ఈ కార్యక్రమం లో
పి.రాములు నేత జహీరాబాద్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జాగో తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు
మహమ్మద్ ఇన్ నిజాయ్. జాగో తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక కార్యవర్గ
మాదినం శివప్రసాద్ జాగో తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక కార్యవర్గ
ప్యార్ల దేశరథ్ తదితరులు పాలుగోన్నారు
Post Comment