ప్రజాస్వామ్య రక్షణే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ లక్ష్యం..*
ప్రజా సింగిడి ప్రతినిధి,వరంగల్,24,ఏప్రిల్.
*వర్దన్నపేట మండల యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు బర్ల సతీష్ *
ఏఐసీసీ,టీపీసీసీ ఆదేశాల మేరకు రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదానికి పిలుపునిచ్చినట్లు వర్దన్నపేట మండల యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు బర్ల సతీష్ అన్నారు. గురువారం వర్దన్నపేట నియోజకవర్గం, వర్దన్నపేట మండలం, చెన్నారం గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో ముఖ్య అతిథిగా మండల ఇంచార్జి రమేష్ గౌడ్ పాల్గొని గ్రామంలో వాడ వాడనా పాదయాత్ర చేసారు అనంతరం రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేసారు.
మన దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పేద, బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని, ప్రధానికి పేద ప్రజల కంటే బడాబాబులు ముఖ్యమన్నారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని,అంబేడ్కర్,గాంధీ,లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథమన్నారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందన్నారు. అమిత్ షా అంబెడ్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానించారన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. గాంధీ అంబెడ్కర్ ఆశయాలను సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు…ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎదుకు సత్యం, బ్లాక్ అధ్యక్షులు అబ్బిడే రాజిరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పాత్రి బహాను ప్రసాద్, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు కర్ర మాలతీ రెడ్డి, జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షులు రవి, జిల్లా నాయకులు పోషలా వెంకన్న, మాజీ జడ్పీటీసీ ప్రభాకర్ గౌడ్, మండల యూత్ మాజీ అధ్యక్షులు బర్ల సతీష్, కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి పెండ్యాల బిక్షపతి గ్రామ మాజీ సర్పంచ్ సిందాం లక్ష్మి నారాయణ, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు జనగాం చిన్న మల్లయ్య, జన్ను కుమారస్వామి, బర్ల కుమారస్వామి,చీకటి రాములు, జన్ను రాజు, నాపెళ్ళి రవి, కలకోటి దేవేందర్, జన్ను చంద్రయ్య, బర్ల కొమ్మలు, తుల్లా భాస్కర్ జన్ను నాగరాజు అడ్డురి బాలయ్య, అనుబంధ సంఘాలు, పార్టీ కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.




Post Comment